స్థానికుల అప్రమత్తతతో బ్యాటరీ చోరీ ఘటన భగ్నం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : స్థానికుల అప్రమత్తతతో మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో బ్యాటరీ చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలను గ్రామస్తులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున బోగారం గ్రామ పరిసరాల్లో నిలిపి ఉంచిన లారీలు, ఇతర వాహనాల బ్యాటరీలను చోరీ చేసేందుకు ఇద్దరు అనుమానితులు వచ్చారు. వారి అనుమానాస్పద కదలికలను గమనించిన కొందరు అప్రమత్త యువకులు, లారీ యజమానులు వెంటనే అప్రమత్తమయ్యారు. దొంగలు పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వారిని వెంటాడి పట్టుకున్నారు. ఆగ్రహానికి...