కీసరగుట్టలో తప్పిపోయిన బాలిక సురక్షితం
కీసర వాణి పార్కింగ్ ప్రాంతంలో గుర్తించిన కీసర పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత ఆర్ జె న్యూస్, కీసర : కీసరగుట్ట దర్శనానికి వచ్చి తప్పిపోయిన 15 ఏళ్ల బాలిక బుసా లాస్యను కీసర పోలీసులు సురక్షితంగా గుర్తించారు. బాలిక అదృశ్యమైనట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బందోబస్తు సిబ్బంది సహకారంతో బాలిక ఫొటో, వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపించడంతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రకటనలు చేశారు. వాహనాల తనిఖీలు కూడా...