ఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన మహోత్సవం
ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శివ ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో మేకల కృష్ణకృష్ణవేణి దంపతులు రూ.11,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయకుడి విగ్రహాన్ని మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ ప్రాంగణంలోని మంజీరా నదికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా...