మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..! డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు సీఐటీయూ వినతి.
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల చట్టం ప్రకారం మున్సిపల్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఏడు నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కార్మికుల జీతాల నుంచి కోతలు విధిస్తున్నప్పటికీ, ఒక...