ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
🔸ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌లో తప్పులకు తావులేకుండా చూడాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆర్.జె న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల హియరింగ్, ధ్రువపత్రాల అప్‌లోడింగ్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటు నిర్ధారణ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాల...