RJNEWS TELUGU
Date of Publish : 30 June 2026, 11:27 am Posted by : RJ NEWS TELUGU

ఎస్ఐర్ ప్రక్రియ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్..

మేడ్చల్, జూన్ 30

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనీలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అద్భుతంగా కొనసాగుతోందని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పేర్కొన్నారు. కాల నీలో ఎమ్యునరేషన్ ఫారాలను బీఎల్వోలతో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప ఎనిసరిగా ఈ ఫారాలను పూర్తి చేసిన తర్వాత తిరిగి బీఎల్ వోలకు అందించాలని ఓటర్లకు సూచించారు. ప్ర భుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, బుర్కాగాళ్ల శ్రీనివాస్, బీఎల్ ్వ కిరణ్, ఎక్కడిగాళ్ల కృష్ణ, కొమ్ము కృష్ణ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.