పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..! అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం : గరిసెల సురేందర్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సుతారిగూడలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.పౌరసరఫరాల అధికారులు, స్థానిక రేషన్ డీలర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ...