ఎస్‌ఐపై చేయిచేసుకున్న యువకుడు..! పోలీసు విధులకు ఆటంకం.. ఇద్దరికి రిమాండ్
ఆర్.జె.న్యూస్, అల్వాల్ : బోనాల బందోబస్తులో ఉన్న పోలీసు ఎస్‌ఐపై చేయిచేసుకున్న ఘటన ఆల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఎంజీ నగర్‌లోని భూలక్ష్మమ్మ ఆలయం వద్ద ఎస్‌ఐ దేవేందర్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవపడుతుండటంతో వారిని శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే మీసాల సంతోష్ అనే యువకుడు ఆగ్రహంతో ఎస్‌ఐ దేవేందర్‌పై చేయిచేసుకుని ఎడమ చెంపపై రెండుసార్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో జారిపోతుల దీపక్...