RJNEWS TELUGU
Date of Publish : 29 September 2026, 7:59 pm Posted by : RJ NEWS TELUGU

పార్కింగ్‌ చేసిన వాహనం చోరీ

🔸సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదు

ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : పార్కింగ్‌ చేసిన వాహనం చోరీకి గురైన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. విజయ రెసిడెన్సీ సమీపంలో ఈ నెల 28న రాత్రి సుమారు 7.30 గంటలకు వాహనాన్ని పార్కింగ్‌ చేసి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వచ్చి చూడగా వాహనం కనిపించలేదు.చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే వాహనం చోరీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.