ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
🔸అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశం 🔸147 దరఖాస్తుల స్వీకరణ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 147 దరఖాస్తులు అందినట్లు...