రూ.6 లక్షలతో UGD పనులకు శ్రీకారం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్ జనరల్ నిధుల నుంచి రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు UGD పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పనులు పూర్తయితే మురుగునీటి పారుదల...