RJNEWS TELUGU
Date of Publish : 07 September 2026, 6:26 pm Posted by : RJ NEWS TELUGU

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 105 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నందున వారి సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, లా ఆఫీసర్ చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.