ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 105 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రజలు వివిధ...