టెన్త్ చదివి డాక్టర్లమయ్యారు..!
🔸అమాయకుల ప్రాణాలతో చెలగాటం 🔸సైబరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు 🔸ఏకకాలంలో 10 ఫేక్ క్లినిక్‌లపై దాడులు.. 10 మంది అరెస్ట్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తెల్లకోటు వేసుకుంటే డాక్టర్లు అయిపోతామనుకున్నారో ఏమో..! టెన్త్, ఇంటర్, బీకాం వంటి సాధారణ విద్యార్హతలతోనే ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు చికిత్స చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్నపిల్లలకు సైతం చికిత్స అందిస్తూ, రోగులకు సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న నకిలీ డాక్టర్ల గుట్టును సైబరాబాద్...