రావల్‌కోల్‌లో దొంగల హవా – స్థానికుల్లో ఆందోళన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో వరుస చోరీలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు ఒకే ప్రాంతంలో మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకుని తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.బందెల ముత్యాల ఇంటితోపాటు మరో రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 9 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇళ్లకు తిరిగి...