RJNEWS TELUGU
Date of Publish : 05 November 2026, 7:01 pm Posted by : RJ NEWS TELUGU

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

🔸గుండ్లపోచంపల్లి సమీపంలో 3.323 కిలోల గంజాయి స్వాధీనం
🔸 ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు
🔸మూడు ప్యాకెట్లలో గంజాయి గుర్తింపు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 3.323 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి సమీపంలోని మాలిక్‌ కాక్‌ఫైర్‌ పబ్‌ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌-ఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐ రమేష్‌ నేతృత్వంలోని బృందం దాడి చేసి మూడు ప్యాకెట్లలో ఉన్న గంజాయిని పట్టుకున్నారు.ఈ ఘటనలో షేక్‌ ముఖ్తార్‌ (21), మహమ్మద్‌ గౌసొద్దీన్‌ (24), బుయ్య శుభం (21)లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణ నిమిత్తం మేడ్చల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు.