RJNEWS TELUGU
Date of Publish : 25 November 2026, 7:15 pm Posted by : RJ NEWS TELUGU

టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

🔸తలపై నుంచి వెళ్లిన టిప్పర్ చక్రాలు.. అక్కడికక్కడే రాజగౌడ్ (50) మృతి

ఆర్ జె న్యూస్, వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాయత్రి జ్యువెలరీ షాప్ ఎదుట జరిగిన ఈ ప్రమాదంలో రాజగౌడ్ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజగౌడ్ బుధవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో గాయత్రి జ్యువెలరీ షాప్ సమీపంలో ఉండగా, TG 07 X 1188 నంబర్ గల టిప్పర్ లారీ అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.