RJNEWS TELUGU
Date of Publish : 24 August 2026, 9:05 pm Posted by : RJ NEWS TELUGU

కూకట్‌పల్లిలో విషాదం – ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ఆర్ జె న్యూస్ బ్యూరో : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. 6వ ఫేజ్‌లోని పంచమతి అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శీతల పురుషోత్తం (30) గా గుర్తించారు. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న శీతల మెడిసిన్ వాడుతున్నట్లు ప్రాథమిక సమాచారం. మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.