అలియాబాద్‌లో ‘ఉల్లాస అమ్మకు అక్షరమాల’పై శిక్షణ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఉల్లాస అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ఆర్పీలు, అంగన్‌వాడీ టీచర్లకు కార్యక్రమం అమలు విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత అందించడమే ఉల్లాస అమ్మకు అక్షరమాల కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. చదువుకు దూరంగా ఉన్నవారిని గుర్తించి వారికి విద్యను అందించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. అక్షరాస్యత పెంపుతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెరుగుతాయని తెలిపారు....