RJNEWS TELUGU
Date of Publish : 02 October 2026, 9:15 pm Posted by : RJ NEWS TELUGU

గాంధీజీకి ఘన నివాళి

ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా శుక్రవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు.కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం తరఫున హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, ఎల్‌డీఎం శివప్రసాద్‌ తదితర అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు