వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు – జిల్లా కలెక్టర్ మను చౌదరి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి...