ల్యాబ్ టెక్నీషియన్ మెడలో గొలుసు లాగేందుకు యత్నం

ఆర్.జె.న్యూస్, క్రైమ్ బ్యూరో : రక్త నమూనాల సేకరణకు వెళ్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు ఇద్దరు దుండగులు యత్నించిన ఘటన గురువారం అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. పాత అల్వాల్‌లోని గణేష్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఓ మహిళ సూర్యనగర్‌లోని లోటస్‌ డయాగ్నోస్టిక్స్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం రక్త నమూనాల సేకరణ కోసం తన మోపెడ్‌పై సెయింట్‌ మైఖేల్‌ స్కూల్‌ నుంచి కేబీఆర్‌ రెసిడెన్సీ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఎరుపు, నలుపు రంగుల...