పన్నెండేళ్ల వైష్ణవి.. నృత్యంలో ప్రపంచ రికార్డుల లక్ష్యం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రపంచ రికార్డులే లక్ష్యంగా ముందుకు సాగుతోంది 12 ఏళ్ల రుంకు వైష్ణవి. భక్తి, కళను మేళవించి వినూత్న నృత్య ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. 12 ఏళ్ల వయసులో 12 కిలోమీటర్ల నాన్‌స్టాప్ కూచిపూడి వాకథాన్ నిర్వహించడంతో పాటు, 12 ప్రపంచ రికార్డులు సాధించాలనే సంకల్పంతో వైష్ణవి సిద్ధమైంది. ఇందులో భాగంగా 122 రకాల గణపతి భంగిమలు, 522 గణేశ గీతాలతో నృత్య ప్రదర్శన ఆదివారం ప్రదర్శించింది...