RJNEWS TELUGU
Date of Publish : 12 August 2026, 9:27 pm Posted by : RJ NEWS TELUGU

కొంపల్లిలో యూటర్న్‌ మూసివేత

ఆర్. జె. న్యూస్, మేడ్చల్ : కొంపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న యూటర్న్‌ను బుధవారం (ఆగస్టు 12) నుంచి పూర్తిగా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించి వాహనదారులు, స్థానికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
🔸ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..!
దేవరాయంజాల్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్లే వాహనదారులు కొంపల్లి రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఉన్న వెహికల్‌ అండర్‌పాస్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
కొంపల్లి నుంచి దేవరాయంజాల్‌ వైపు వెళ్లే చిన్న వాహనాలు వి. కన్వెన్షన్‌ వైపు నుంచి ఉన్న వెహికల్‌ అండర్‌పాస్‌ను ఉపయోగించాలి. భారీ వాహనాలు ప్రెస్టీజ్‌ పార్క్‌ వద్ద ఉన్న వెహికల్‌ అండర్‌పాస్‌ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. మళ్లింపు మార్గాలు, అండర్‌పాస్‌ల సమీపంలో వాహనాల వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు. వాహనదారుల సౌకర్యార్థం సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
🔸రాంగ్‌రూట్‌పై చర్యలు
మూసివేసిన యూటర్న్‌ వద్ద రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. రాంగ్‌రూట్‌లో వచ్చే వాహనాల వల్ల తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వాహనదారులు మార్గమార్పులను గమనించి పోలీసులకు సహకరిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని మేడ్చల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ విజ్ఞప్తి చేశారు.