కొంపల్లిలో యూటర్న్ మూసివేత
ఆర్. జె. న్యూస్, మేడ్చల్ : కొంపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న యూటర్న్‌ను బుధవారం (ఆగస్టు 12) నుంచి పూర్తిగా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించి వాహనదారులు, స్థానికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 🔸ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..! దేవరాయంజాల్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే వాహనదారులు కొంపల్లి రోడ్డు ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న వెహికల్ అండర్‌పాస్‌ను వినియోగించుకోవాలని సూచించారు. కొంపల్లి నుంచి...