ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన చైర్‌పర్సన్‌గా నియమితులైన మధుయాష్కీ గౌడ్‌ను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అభినందించారు. ఈ మేరకు ఆదివారం మధుయాష్కీ గౌడ్ నివాసానికి వెళ్లిన వజ్రేష్ యాదవ్‌తో పాటు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నయా భూపతి రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో మధుయాష్కీ గౌడ్ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ విభాగం అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని పేర్కొన్నారు.