ఆర్ జె న్యూస్,వెబ్ డెస్క్ : మేడ్చల్ మల్కాజిగిరి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ కానాజిగూడ శోభా గార్డెన్ లో వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.బిజెపి జిల్లా అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాగా.. మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ శ్రేణులతో కలిసి సామూహికంగా వీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఈటల రాజేందర్… ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో కొనసాగుతున్న తీరును, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను పెంచడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని కొనియాడారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి భారీ ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ శ్రేణుల భారీ ర్యాలీతో ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. “మోదీ.. మోదీ”, “భారత్ మాతాకీ జై” నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ,మాధవ్,డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,అనిల్, కార్తీక్ గౌడ్,రాజి రెడ్డి,కార్తీక్, బీజేపీ నాయకులు మోయి సుజాత,లక్ష్మణ్ ,మురళి తదితరులు పాల్గొన్నారు.