డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షనా? ప్రజల మంచినీటిని వ్యాపారంగా మార్చొద్దు: ఏనుగు సుదర్శన్‌రెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : డబ్బులు చెల్లిస్తేనే నీటి కనెక్షన్‌ ఇస్తున్నారన్న ఆరోపణలు రావడంపై మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి స్పందించారు. ప్రజలకు అందాల్సిన మంచినీటిని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌ సూరజ్‌నగర్‌ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను గురువారం ఆయన పరిశీలించారు. చెంగిచెర్ల డివిజన్‌ అధ్యక్షుడు ఏర్పుల మహేష్‌తో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన.. పలు వీధుల్లో పైప్‌లైన్ల పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా స్ట్రీట్‌ నంబర్‌–3 లెఫ్ట్‌సైడ్‌లో...