నగరంలో నీటి కష్టాలు.. చెరువుల వద్ద అక్రమ దందాలు
🔸ఫాక్స్‌సాగర్ వద్ద హైడ్రా కొరడా.. అక్రమ షెడ్ల కూల్చివేత 🔸జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో అక్రమ నీటి వ్యాపారంపై అధికారుల చర్యలు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఓవైపు నగరంలో నీటి అవసరాలు పెరుగుతూ, మరోవైపు నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. చెరువుల జలాలను అక్రమంగా వ్యాపారానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. జలవనరులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, చెరువుల పరిసరాల్లో బోర్లు వేసి నీటిని విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పరిధిలోని ఫాక్స్‌సాగర్ చెరువు...