ఆటో కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటాం

🔸ఎల్లమ్మ, కట్ట మైసమ్మకు రాఘవేందర్ గౌడ్ ప్రత్యేక పూజలు. ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతల పూజా కార్యక్రమంలో ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు....