పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తాం..! జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి
ఆర్ జె న్యూస్ , మేడ్చల్: జిల్లాలోని గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా గ్రంథాలయ సంస్థk చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సి. వసుంధర తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించారు. జిల్లాలో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాల ఆధునికీకరణతో పాటు పాఠకులకు తాగునీరు, ఫర్నిచర్, పుస్తకాల ర్యాకులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక...