నాగారం లో విగ్రహం సిద్ధం – ఆవిష్కరణ ఎప్పుడు ?
🔸రాంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నోచుకోని ప్రారంభోత్సవం - ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ రాంపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు నోచుకోకపోవడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు పూర్తయి రోజులు గడుస్తున్నా ఆవిష్కరణపై స్పష్టత లేకపోవడం పట్ల అంబేద్కర్ అభిమానులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగారం పరిధిలో పలువురు ప్రజాప్రతినిధులు, బడా...