పండగకు ఊరెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో చోరీ
10 తులాల బంగారం.. 12 తులాల వెండి అపహరణ ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : వినాయక చవితి పండగకు సొంతూరికి వెళ్లిన దంపతులు తిరిగి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంటిని గుల్ల చేసిన ఘటన చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రైల్వే కాలనీలోని ప్లాట్ నంబర్ 19లో ఈ చోరీ జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. ఇంట్లో నివాసముండే దంపతులు వినాయక చవితి సందర్భంగా ఈ నెల 12న శనివారం సొంతూరికి వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి...