14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు సీఎంకు ఎందుకు భయం..? – ఆర్. కృష్ణయ్య

ఆర్.జె.న్యూస్, రామంతపూర్ : రాష్ట్రంలో 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు భయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. మంగళవారం రామంతపూర్ లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు జల్లపల్లి అంజి నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ఫీజు బకాయిలు రూ. 8 వేల కోట్లు చెల్లించడానికి...