బృందావన్ ఆస్పత్రిలో మహిళ మృతి – వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

ఆర్ జె న్యూస్ బ్యూరో : సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. బృందావన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 🔸ఘటన వివరాలు : కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ బృందావన ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు కడుపులో సిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. సిస్ట్ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేస్తుండగా అధిక రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించిందని, దీంతో మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళ మృతి...