మేడ్చల్ జాతీయ రహదారిపై యమపాశం – వెనుకకు పొడుచుకొచ్చిన ఇనుప రాడ్లతో డీసీఎం..!
మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 4 : మేడ్చల్ జాతీయ రహదారిపై ఓ డీసీఎం TS10UA1024 నంబర్ గల వాహనం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వెనుక భాగం నుంచి ప్రమాదకరంగా పొడుచుకొచ్చిన ఇనుప రాడ్లతో వాహనం రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్న దృశ్యం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఐషర్ డీసీఎంలో భారీగా లోడ్ చేసిన ఇనుప రాడ్లు వాహనం వెనుక భాగం నుంచి దాదాపు 5-6 అడుగుల మేర బయటకు పొడుచుకు వచ్చాయి. ఎలాంటి రెడ్ ఫ్లాగ్, రిఫ్లెక్టర్ సూచికలు లేకుండా, భద్రతా...