RJNEWS TELUGU
Date of Publish : 24 September 2026, 7:15 pm Posted by : RJ NEWS TELUGU

మాదకద్రవ్యాల రహిత సమాజానికి యువతే కీలకం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక సూచించారు. మై భారత్‌ – ఎన్‌ఎస్‌ఎస్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం సహకారంతో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్‌ –100 వారాల సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా జగద్గిరిగుట్టలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ‘మై హెల్త్‌–మై ప్రైడ్‌’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘పోషకాహారం ప్రాముఖ్యత–మంచి ఆరోగ్యం’పై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డాక్టర్‌ ప్రియాంక సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇష్రత్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి. స్రవంతి, అకాడమిక్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ ఎం. గీత, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె. అనిత, డాక్టర్‌ ప్రవీణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.