ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మండలం అక్బర్‌జాపేట్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్బర్‌జాపేట్‌కు చెందిన టేకుల గణేశ్ (20) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండాలని తండ్రి హన్మంత్ ఇటీవల సూచించాడు. దీంతో గణేశ్ గత రెండు వారాలుగా విధులకు హాజరవుతున్నాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు తమ పనులకు వెళ్లగా.. గణేశ్ కూడా భోజన డబ్బాతో ఉద్యోగానికి బయలుదేరాడు....