క్షయ రహిత భారత్‌కు యువతే బలం..! మేడ్చల్ జిల్లాలో ‘జోష్’ బృందం ప్రారంభం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : క్షయ రహిత భారతదేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్ అన్నారు. ‘టిబి ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో జోష్ (Joint Squad for Health) బృందాన్ని గురువారం ప్రారంభించారు. డా. ఆనంద్ మాట్లాడుతూ.. క్షయ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, యువత సహకారం, వైద్యశాఖ సమన్వయం అవసరమన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు టిబిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ‘నిక్షయ్...