RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 9:05 pm Posted by : RJ NEWS TELUGU

యువత విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్‌లో ఉన్న సిఎంఆర్ స్కూల్‌ మైదానంలో నిర్వహిస్తున్న మల్లారెడ్డి యంగ్ టైటన్స్ క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 సీజన్–1కు శనివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.అనంతరం మల్లారెడ్డి స్వయంగా బ్యాట్ పట్టి మైదానంలో క్రికెట్ ఆడటంతో క్రీడాకారులు, యువతలో ఉత్సాహం నెలకొంది. ఆయన క్రికెట్ ఆడుతున్న దృశ్యాలను క్రీడాకారులు, అభిమానులు ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు మంచి వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, క్రీడాకారులు, యువత, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.