యువత చెడుసావాసాలకు దూరంగా ఉండాలి చదువు, క్రీడలు, ఉద్యోగంపై దృష్టి సారించాలి : ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : యువత చెడుసావాసాలకు బానిస కాకుండా చదువు, క్రీడలు, ఉద్యోగంపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. శామీర్పేట మండలంలో నిర్వహించిన బండి రాఘవరెడ్డి (బీఆర్ఆర్) స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జై హనుమాన్ గుడ్విల్స్, ఆలియాబాద్ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.25 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన తుర్కపల్లి బుల్స్ జట్టుకు రూ.12,500 నగదు బహుమతులను ఎమ్మెల్యే మల్లారెడ్డి అందజేశారు.అనంతరం...