🔸పోచమ్మ ఆలయం సమీపంలో మురుగునీటి ఇబ్బందులు..
🔸చిన్నారులు సైతం ప్రమాదాలకు గురవుతున్న వైనం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో డ్రైనేజీ సమస్య స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పోచమ్మ ఆలయం సమీపంలో డ్రైనేజీ లైన్ పగిలిపోయి నెల రోజులకు పైగా గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీ సమస్యను స్థానికులే శుభ్రం చేసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు సైతం ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పగిలిపోయిన డ్రైనేజీ పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
