Tuesday, November 24, 2026
Homeక్రైమ్ న్యూస్బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip

షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. కాలిపోయిన పాత బట్టల నిల్వలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌ జిల్లా లాల్‌గడి మలక్‌పేట్‌ గ్రామంలోని ఓ బట్టల గోడౌన్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు జీనోమ్‌ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో నిల్వ ఉంచిన పాత బట్టల స్టాక్‌ అగ్నికి ఆహుతైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!