Saturday, October 3, 2026
Homeతెలంగాణపొల్యూషన్ నీటితో పంటలు నాశనం.. రైతుల...

పొల్యూషన్ నీటితో పంటలు నాశనం.. రైతుల ఆవేదన

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా, కీసర : అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 812లో ఈ పవర్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి విడుదలవుతున్న కాలుష్య నీటి కారణంగా రైతుల పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్య నీరు వ్యవసాయ పొలాల్లోకి చేరడంతో పంటలు నాశనమవుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య నీటి ప్రభావంతో భూమి సారవంతత కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, కాలుష్య నీటిపై పరీక్షలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కంపెనీ తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించడంతో పాటు, కాలుష్య నీరు పొలాల్లోకి చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!