Friday, October 2, 2026
Homeక్రైమ్ న్యూస్లిఫ్ట్ పేరుతో ట్రాప్.. కత్తితో బెదిరించి...

లిఫ్ట్ పేరుతో ట్రాప్.. కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఆరుగురు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా: లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దోచుకున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 31 రాత్రి అంబేద్కర్ నగర్‌లో పద్మారావు అనే వ్యక్తి నుంచి లిఫ్ట్ తీసుకున్న నిందితులు కొద్దిదూరం వెళ్లిన తర్వాత అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం మరో ఐదుగురు కలిసి కత్తితో బెదిరించి బాధితుడి వద్ద ఉన్న రూ.5,000 నగదుతో పాటు గూగుల్ పే ద్వారా మరో రూ.800 బలవంతంగా బదిలీ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, విశ్వసనీయ సమాచారం ఆధారంగా అత్తాపూర్–రాజేంద్రనగర్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో మహమ్మద్ సుబాన్ అలియాస్ ఎం.డి. ఫయాజ్ (19), మహమ్మద్ అజీజ్ (21), షేక్ వహీద్ (22), మహమ్మద్ సోహెలుద్దీన్ (21), మీర్ ఉనయత్ అలీ (24), సయ్యద్ అబ్రార్ (21) ఉన్నారు.విచారణలో తాము సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి ఒక కత్తి, నాలుగు మొబైల్ ఫోన్లు (వివో Y21, వివో 1610, ఒప్పో K12, శాంసంగ్) స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!