ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బోనాల పండుగలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హల్చల్ చేశారు. మొదట ఏడుగుల వద్దకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుడిలాగా బ్యాండ్ వాయించి, స్థానిక యువతను ఉత్సాహపరిచారు. ఆయన హుషారుని చూసి నాయకులు, స్థానికులు, యువకులు ఈలలు వేసి, కేరింతలతో చప్పట్లు కొట్టారు.
