ఆర్ జె న్యూస్, మేడ్చల్ :టీజీఎస్‌ఆర్టీసీ మెడ్చల్ డిపోలో క్లెయిమ్ చేయని పార్సిళ్లను ఈ నెల 4న బహిరంగ వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ కె. పరిమళ తెలిపారు. నవంబర్-2024 నుంచి మే-2026 వరకు డిపోలో నిల్వ ఉన్న పార్సిళ్లపై సంబంధిత వినియోగదారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడ్చల్ డిపో గూడ్స్ ఆవరణలో వేలం జరుగుతుందని తెలిపారు.ఆటోమొబైల్ స్పేర్స్, బయో మెడికల్, వస్త్రాలు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, జనరల్, ఫార్మా, రైస్ అండ్ అగ్రి, స్టేషనరీ తదితర మొత్తం 30 పార్సిళ్లు వేలానికి ఉంచుతున్నట్లు చెప్పారు. ఆసక్తి గల ప్రజలు వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కె. పరిమళ కోరారు.
మేడ్చల్ డిపోలో క్లెయిమ్ చేయని పార్సిళ్లకు ఆగస్టు 4న బహిరంగ వేలం
RELATED ARTICLES
