🔸 హకీంపేట్, దేవరయాంజాల్, తుంకుంట ప్రాంతాల్లో ఆలయాల సందర్శన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించారు.హకీంపేట్, దేవరయాంజాల్, తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించిన మల్లారెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.బోనాల పండుగ సందర్భంగా ఆయా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా మల్లారెడ్డి భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
