Tuesday, September 1, 2026
Homeమేడ్చల్ జిల్లాఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ అసోసియేషన్‌...

ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, క్రైమ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు గురువారం కూకట్‌పల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కూకట్‌పల్లి ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓ నాగేందర్‌గౌడ్‌ వ్యవహరించారు. జిల్లాలోని హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగాఎన్‌.రమేష్‌కుమార్‌ 104 ఓట్లతో, ప్రధాన కార్యదర్శిగా కె.ముకేష్‌ 109 ఓట్లతో, కోశాధికారిగా ఆర్‌.జైపాల్‌ 85 ఓట్లతో, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వి.శ్రీకాంత్‌ 76 ఓట్లతో, పబ్లిసిటీ సెక్రటరీగా పి.రమేష్‌ 63 ఓట్లతో విజయం సాధించారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఎం.వికాస్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ (మహిళ)గా జి.దీపాకుమారి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌–1గా బి.చైతన్య వంశీ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌–2 (మహిళ)గా ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్‌ ప్రతినిధులకు పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాములు, పవన్‌కుమార్‌, రామకృష్ణ, అనంతరెడ్డి, కో-ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.హరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!