Saturday, October 3, 2026
HomeతెలంగాణGHMCకనుల పండుగగా శ్రీ శ్రీ శ్రీ...

కనుల పండుగగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 4 :
సైబరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కిష్టాపూర్ – పూడూర్ డివిజన్ కిష్టాపూర్ అర్చన కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కనుల పండుగగా జరుగుతుంది. శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చండి ఉపాసకులు బ్రహ్మశ్రీ సంజయ శర్మ వైదిక బృందంతో శుక్రవారం ఉదయం మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్య సంస్కారం, రక్షాబంధనం ఆచార్యాది రుత్విక్ వరణం, అంకురార్పణ యాగశాల ప్రవేశం, అఖండదీప స్థాపన, చతుషష్ఠి యోగిని సహిత వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ సర్వతోభద్ర మండప దేవత కలశస్థాపన పూజ యంత్రాభిషేకం మహిళచే కుంకుమార్చన, అగ్నిప్రతిష్ఠ
గణపతిహోమం మూలమంత్రహోమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
సాయంత్రం 4 నుండి స్థాపిత దేవత హవనం సూక్త, ప్రతిష్టాంగా హోమాలు రుద్రహోమము భక్తులచే ప్రతిష్ఠ విగ్రహాలకు జలాదివాసం హారతి మంత్రపుష్పం, తీర్థ, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!